‘నిద్రపోవద్దు. ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అతను అంత దగ్గరవుతాడు అంటోంది’ వి డ్రీమ్ ఫిల్మ్స్ సంస్థ. మమ్ముట్టి లీడ్ రోల్‌లో మలయాళ–తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ దర్శకత్వంలో ఈ సంస్థ ‘డోంట్ స్లీప్’ టైటిల్‌తో ఓ సినిమా నిర్మిస్తోంది.
ఈ తెలుగు చిత్రానికి ‘ది లాంగర్ యు స్లీప్, ది క్లోజర్ హీ గెట్స్’ (ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అతను అంత దగ్గరవుతాడు) అనేది ట్యాగ్‌లైన్. ‘చౌర్య పాఠం’ ఫేమ్ ఇంద్ర రామ్ హీరోగా రూపొందుతున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ని విజయ్ సేతుపతి ఆవిష్కరించారు. ‘‘ఎమోషనల్‌గా సాగే ఈ చిత్రం టెక్నికల్‌గానూ గొప్పగా ఉంటుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.


