విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేశాడు. అతను నటించిన తొలి సినిమా తమిళ్లో ‘ఫీనిక్స్’ పేరుతో ఇప్పటికే విడుదలైంది. అక్కడ ఫర్వాలేదనిపించిన ఈ మూవీ ఇప్పుడు ఇదే టైటిల్తో తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు.
ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని రాజ్యలక్ష్మి అనల్ అరసు నిర్మించారు. జూలై 4న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తెలుగు వర్షన్ నవంబర్ 7న థియేటర్లో విడుదల కానుంది. ఈమేరకు హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా మేకర్స్ నిర్వహించారు.

ఫీనిక్స్ సినిమాలో యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్ కూడా సూర్య సేతుపతి పండిచాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించారు. మీడియా సమావేశంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తన కుమారుడు ఒక మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎమోషనల్ అండ్ హై యాక్షన్ స్టోరీతో సినిమా తీశామని తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన తెలిపారు.


