నయనతార భర్తతో గొడవ..స్పందించిన విజయ్‌ సేతుపతి | Vijay Sethupathi on fight with Vignesh Shivan during Naanum Rowdy Thaan | Sakshi
Sakshi News home page

నయనతార భర్తతో గొడవ..స్పందించిన విజయ్‌ సేతుపతి

Jun 15 2024 4:56 PM | Updated on Jun 15 2024 5:09 PM

Vijay Sethupathi on fight with Vignesh Shivan during Naanum Rowdy Thaan

మహారాజా చిత్రంతో మరో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు విజయ్‌ సేతుపతి. తన కెరీర్‌లో 50వ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడంతో విజయ్‌ సేతుపతి ఆనందం వ్యక్తం చేశాడు.అంతేకాదు ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో జరిగిన గొడవపై స్పందించాడు. అతన్ని అపార్థం చేసుకోవడం వల్లే గొడవ జరిగిందని చెప్పారు.

(చదవండి: మహారాజా మూవీ రివ్యూ)

‘నానుమ్‌ రౌడీ థాన్‌’(తెలుగులో నేను రౌడీ) సినిమా షూటింగ్‌ మొదటి రోజే విఘ్నేశ్‌తో గొడవ జరిగింది. ఆ రోజు సాయంత్రం నేనే అతని ఫోన్‌ చేసి ‘నువ్వు నాకు నటన నేర్పుతున్నావా?’అని గట్టిగా అరిచాను. నాలుగు రోజుల తర్వాత నయనతార వచ్చి మా ఇద్దరికి నచ్చచెప్పింది. వాస్తవానికి నేను విక్కిని సరిగా అర్థం చేసుకోలేదు. స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు కొత్తగా అనిపించి వెంటనే ఓకే చెప్పాను. 

కానీ షూటింగ్‌ రోజు ఆయన అంచనాకు తగ్గట్టుగా నటించలేదు. మొదటి నాలుగు రోజు నా పాత్రను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. కొన్ని సన్నివేశాల్లో నటించినప్పుడు అభద్రతాభావానికి గురయ్యాను. ఒకరికొకరం అర్థం చేసుకున్నాక.. షూటింగ్‌ సాఫీగా సాగిపోయింది. విఘ్నేశ్‌ టాలెంట్‌ ఉన్న దర్శకుడు. ఎవరు టచ్‌ చేయని కథలను గొప్పగా తీయగలడు. ఇప్పడు మేమిద్దరం మంచి స్నేహితులయ్యాం’అని విజయ్‌ సేతుపతి చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement