
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమాకు కోలీవుడ్‌లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే డైరెక్టర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మర్టర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.
ఇటీవల మార్గన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హీరో విజయ్ ఆంటోనీ హాజరయ్యారు. అయితే మూవీ పాత్రకు సంబంధించిన గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ సందర్భంగా మీ గెటప్ గురించి ఏమైనా రివీల్ చేస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మీకు సినిమా మొత్తం ఇక్కడే చూపిస్తామని నవ్వుతూ మాట్లాడారు. ఒకవేళ ఇండియాలో నేనే గనక రిచ్ అయ్యుంటే.. నా సినిమాలన్నీ ఉచితంగా ప్రదర్శించేవాడినని విజయ్ అన్నారు. ఇది విన్న అభిమానులు విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మార్గన్ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్‌లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.