వేణు ఊడుగుల కొత్త సినిమా.. ఈ సారి బ్రదర్‌ ఎమోషన్‌! | Venu Udugula Latest Movie Updates | Sakshi
Sakshi News home page

వేణు ఊడుగుల కొత్త సినిమా.. ఈ సారి బ్రదర్‌ ఎమోషన్‌!

Apr 5 2026 2:15 PM | Updated on Apr 5 2026 3:41 PM

Venu Udugula Latest Movie Updates

ఒకవైపు దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు వేణు ఊడుగుల. ఆయన నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం భారీ కలెక్షన్స్‌తో బోలెడు అవార్డులను సొంతం చేసుకుంది. ఆయన సమర్పణలో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. ప్రముఖ అడ్వకేట్ , రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి తన ‘సైన్మా స్టూడియోస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.పీవీఎన్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నిర్మాత డా.నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి కంటిని, ఆ కంటిలో ఇద్దరు బ్రదర్స్‌ సైకిల్ పై వెళ్తుండటం చూపించారు.‘గుణం, గణం, నీతో రణం - ఇది తథ్యం’.. ఇద్దరు సోదరుల భావోద్వేగభరితమైన కథ ’ అంటూ వేణు ఊడుగుల ఈ పోస్టర్‌ని ట్వీట్‌ చేశాడు.  ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement