థియేటర్‌లో శర్వానంద్‌ సాష్టాంగ నమస్కారం | Actor Sarvanand Big Thanks To In SRIRAM THEATRE | Sakshi
Sakshi News home page

థియేటర్‌లో శర్వానంద్‌ సాష్టాంగ నమస్కారం

Apr 5 2026 1:34 PM | Updated on Apr 5 2026 3:15 PM

Actor Sarvanand Big Thanks To In SRIRAM THEATRE

టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ - రాజశేఖర్‌ కలిసి నటించిన కొత్త సినిమా ‘బైకర్‌’. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు శర్వానంద్‌ కూడా థియేటర్స్‌లోని తమ ఫ్యాన్స్‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో  హైదరాబాద్‌లోని  శ్రీరాములు థియేటర్‌లో అభిమానులను చూసిన శర్వానంద్‌  భావోద్వేగానికి గురైయాడు.

ఆదివారం కావడంతో శ్రీరాములు థియేటర్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. శర్వానంద్‌ సినిమా మధ్యలో థియేటర్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు విజిల్స్‌ వేస్తూ  హర్షధ్వానాలు పలికారు. అయితే, వేదికపై వచ్చిన శర్వానంద్  మైక్ పట్టుకుని మాట్లాడకుండానే తనను ఈ రేంజ్‌కు తెచ్చిన వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. తనకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు శర్వానంద్  ధన్యవాదాలు తెలిపారు.

భారతీయ తొలి మోటోక్రాస్‌ రేసింగ్‌ సినిమాగా ‘బైకర్‌’ చిత్రాన్ని దర్శకుడు అభిలాష్‌ రెడ్డి  తెరకెక్కించారు. ఇందులో శర్వానంద్‌కు జంటగా మాళవిక నాయర్‌ నటించారు.  ఈ సినిమాని  యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement