జంధ్యాల స్టైల్‌లో ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ | Venkatesh Veeravarapu Talks About Teliyadu Gurthuledu Marchipoya | Sakshi
Sakshi News home page

జంధ్యాల స్టైల్‌లో ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’

Dec 14 2024 6:23 PM | Updated on Dec 14 2024 6:31 PM

Venkatesh Veeravarapu Talks About Teliyadu Gurthuledu Marchipoya

నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’. ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు.  చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ వీరవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా చిత్ర దర్శకుడు వెంకటేష్ వీరవరపు మాట్లాడుతూ.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. ఏజే కథలు సంస్థ ద్వారా తనకు సినిమా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.

 ‘కామెడీ చిత్రాల్లో జంధ్యాల గారివి డిఫరెంట్‌గా ఉండేవి. చాలా రోజుల తర్వాత జంధ్యాల లాంటి కామెడీ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో కామెడీ చాలా కొత్తగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’ అన్నారు. ‘ఏజే కథలు సంస్థల ద్వారానే నేను హీరోగా పరిచయం అవుతున్నాను. తొలి సినిమాకే రఘుబాబు, పృథ్వి లాంటి సీనియర్‌ హీరోలతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని హీరో నివాస్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement