ఇరవై సార్లు పెళ్లి చేసుకున్నా: అవికా గోర్‌ | Vadhuvu Streaming In Disney Plus Hotstar From Dec 8th, Avika Gor Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Vadhuvu OTT Series: ఇరవై సార్లు పెళ్లి చేసుకున్నా

Published Sat, Dec 2 2023 5:32 AM

Vadhuvu streaming in Disney Plus Hotstar from Dec 8th - Sakshi

‘‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌ మొదలుకొని ఇప్పటివరకూ నేను ఆన్‌ స్క్రీన్‌పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్‌ కొట్టలేదు. పెళ్లి కూతురిలా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం. మరోసారి ‘వధువు’లో పెళ్లి కూతురిగా నటించాను. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన ఈ సిరీస్‌ ఆసక్తిగా సాగుతుంది’’ అని హీరోయిన్‌ అవికా గోర్‌ అన్నారు. నందు, అలీ రెజా, అవికా గోర్‌ కీలక పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్‌ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ‘వధువు’ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా అవికా గోర్‌ మాట్లాడుతూ–‘‘బెంగాలీ సక్సెస్‌ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఇందు’ను తెలుగులోకి  ‘వధువు’గా తీసుకొస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్‌లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నాకు టీవీ సీరియల్స్‌ చేసిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్‌ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుంది. ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల నా పర్సనల్‌ లైఫ్‌కు టైమ్‌ కోల్పోయినా... నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను.. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్‌ చూస్తున్నాను. నిర్మాతగా ‘పాప్‌ కార్న్‌’ సినిమా తీయడం గర్వంగా ఉంది. ఎలాంటి హంగామా లేకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నా పెళ్లి చేసుకోవాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్‌ హీరోగా రూపొందుతున్న ఒక సినిమా చేస్తున్నా. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement