
త్రిప్తి డిమ్రీ(Tripti Dimri ).. ‘యానిమల్’సినిమాకు ముందు ఈ బ్యూటీ ఎవరనేది పెద్దగా తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా..అవేవి త్రిప్తికి గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. కానీ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్‌లో అందాల ఆరబోసి ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత త్రిప్తికి వరుస చాన్స్‌లు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ త్రిప్తి పేరు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దానికి కారణం మళ్లీ సందీప్ రెడ్డినే. ప్రభాస్‌తో ఆయన తెరకెక్కించబోతున్న ‘స్పిరిట్’ చిత్రంలో త్రిప్తిని హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించడంతో త్రిప్తి పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.
దీపికా ప్లేస్‌లో..
ప్రభాస్‌తో సందీప్ తెరకెక్కించే ‘స్పిరిట్’(Spirit)లో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా నటించాల్సింది. ఈ మేరకు సందీప్ కూడా ఆమెకు కథ చెప్పి ఒప్పించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెను పక్కకు పెట్టి త్రిప్తికి చాన్స్ ఇచ్చాడు. దీపికా పదుకొణె పెట్టిన కండీషన్స్ నచ్చకపోవడంతోనే సందీప్ ఆమెను తప్పించాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో ఎక్స్‌ఫోజింగ్ ఎక్కువగా ఉందని, అది నచ్చకనే దీపికానే తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. అంతేకాదు ‘స్పిరిట్’ కథను లీక్ చేస్తూ.. సందీప్‌ని కించపరిచేలా బాలీవుడ్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది.
రూ.20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా..
స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా దీపికా అయితేనే బాగుంటుందని భావించాడు సందీప్. తొలుత ఆమెకే ఈ కథను వినిపించాడట. ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్లుగా వ్యవహరించారట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తేనే నటిస్తానని చెప్పిందట. అంతేకాదు టైమింగ్స్ విషయంలోనూ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంట్లో చిన్న పాప ఉండడం కారణంగా ఎక్కువ గంటలు పని చేయలేనని చెప్పిందట. దీపికా పెట్టిన కండీషన్స్..ఆమె అడిగిన రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో సందీప్ ఆమెను పక్కకు పెట్టి త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా తీసుకున్నాడు.
ఐదింతలు తక్కువే..
స్పిరిట్ కోసం దీపికా రూ. 20 కోట్ల డిమాండ్ చేస్తే.. దానికి ఐదింతలు తక్కువకు త్రిప్తి ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంటే ఈ సినిమా సినిమాకు గాను త్రిప్తి రూ. 4 కోట్లను పారితోషికంగా అందుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే ఆమెకు ఇది చాలా ఎక్కువ. యానిమల్ కంటే ముందే ఒక్కో సినిమాకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే తీసుకునే త్రిప్తి.. ఆ సినిమా తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇక స్పిరిట్‌కు తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుంది. అయితే దీపికా డిమాండ్ చేసిన పారితోషికంతో పోలిస్తే..త్రిప్తి అడిగింది చాలా తక్కువని..నిర్మాతలు కూడా వెంటనే ఓకే చెప్పేశారట.
ఇక స్పిరిట్ విషయానికొస్తే..ఈ చిత్రంలో ప్రభాస్ పవఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు సమాచారం. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.