Tollywood Producer Dil Raju, Visit USA With His Wife Tejaswini - Sakshi
Sakshi News home page

అమెరికాలో వాలిపోయిన 'దిల్‌' రాజు!

May 5 2021 12:23 PM | Updated on May 5 2021 2:19 PM

Tollywood Producer Dil raju Jets Off To USA With His Wife - Sakshi

నిజానికి దిల్‌ రాజు భార్యతో కలిసి అమెరికా వెళ్లాలని ఎప్పటినుంచో ప్లాన్‌ చేస్తున్నాడట. ఇన్నాళ్లకు అతడికి తీరిక దొరకడంతో..

ఇండియాలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తమ దేశానికి వచ్చేవారిపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు మే 4 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే దీనికన్నా ఒకరోజు ముందే అంటే మే 3వ తారీఖునే ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌ రాజు అర్జంటుగా అమెరికాలో ల్యాండ్‌ అయిపోయాడట. తన భార్య వైఘా రెడ్డి(తేజస్విని)ని తీసుకుని ఆయన అమెరికా వెళ్లిపోయినట్లు సోషల్‌ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్న ఆయన కాస్త విశ్రాంతి తీసుకునేందుకు అక్కడికి వెళ్లాడని అంటున్నారు. నిజానికి దిల్‌ రాజు భార్యతో కలిసి అమెరికా వెళ్లాలని ఎప్పటినుంచో హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఇన్నాళ్లకు అతడికి వెసులుబాటు దొరకడంతో వెంటనే అక్కడ వాలిపోయినట్లు సమాచారం. రెండు నుంచి మూడు వారాల దాకా ఈ దంపతులు అక్కడే ఎంజాయ్‌ చేయనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే దిల్‌ రాజు.. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఎఫ్‌3' సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే నాగచైతన్య 'థాంక్యూ', సమంత 'శాకుంతలం', అవసరాల శ్రీనివాస్‌ 'నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు', రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు.

చదవండి: నా భర్తను కలిసి ఏడాది దాటిపోయింది: హేమ మాలిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement