డేవిడ్ వార్నర్‌ టాలీవుడ్ ఎంట్రీ.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో దిల్‌ రాజు భేటీ! | Tollywood Producer Dil Raju Meet Australia Consulate Persons In Hyderabad | Sakshi
Sakshi News home page

Dil Raju: డేవిడ్ వార్నర్‌ టాలీవుడ్ ఎంట్రీ.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో దిల్‌ రాజు భేటీ!

Apr 11 2025 8:56 PM | Updated on Apr 11 2025 9:12 PM

Tollywood Producer Dil Raju Meet Australia Consulate Persons In Hyderabad

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, టీఎస్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు, నిర్మాత హర్షిత్ రెడ్డి ఆస్ట్రేలియా ప్రతినిధులను కలిశారు. హైదరాబాద్‌లోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆదేశ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కొన్నోలీ, వైస్ కాన్సుల్ హ్యారియెట్ వైట్, స్టెఫీ చెరియన్‌ను కలిశారు.

ఈ సమావేశంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య సృజనాత్మక సహకారంపై వారితో చర్చించారు. ఆస్ట్రేలియాలో టాలీవుడ్ చిత్ర షూటింగ్స్, సాంస్కృతిక పరమైన మార్పిడిపై చర్చలు జరిపారు. అలాగే ఆస్ట్రేలియాలో తెలుగు సినిమా పరిధిని విస్తరించడంపై ప్రతినిధులతో దిల్ రాజు మాట్లాడారు. చర్చల తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సహకారం విషయంలో పూర్తి సానూకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి సంబంధించిన ఫోటోలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. జపాన్‌లోనూ తెలుగు సినిమాలంటే థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ మూవీ దేవరను జపాన్‌లోనూ విడుదల చేశారు. మరోవైపు టాలీవుడ్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్ వార్నర్‌ ఎంట్రీ కూడా ఇచ్చారు. నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్‌ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ.. దిల్‌ రాజు ఆస్ట్రేలియా ప్రతినిధులను కలవడం మరింత ఆసక్తిగా మారింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement