ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్! | Tollywood Hero Jr NTR Popped at Khairathabad RTA Office | Sakshi
Sakshi News home page

Jr NTR: ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్!

Apr 2 2024 3:07 PM | Updated on Apr 2 2024 4:11 PM

Tollywood Hero Jr NTR Popped at Khairathabad RTA Office - Sakshi

టాలీవుడ్ యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్  కూడా పూర్తి చేసుకున్నారు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చినట్లు  తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్‌, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement