స్టార్‌ హీరో సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా? | Tollywood Actress Childhood Pic Goes Viral On Instagram | Sakshi
Sakshi News home page

Tollywood Actress: స్టార్‌ హీరో సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా..!

Published Tue, Nov 14 2023 4:53 PM | Last Updated on Tue, Nov 14 2023 5:02 PM

Tollywood Actress Childhood Pic Goes Viral On Instagram  - Sakshi

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేను శైలజ, రాజుగారి గది, రాజా రాణి, ‌ సాఫ్ట్‌వేర్ సుధీర్, కార్బన్, జగమేమాయ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించింది. బెంగళూరుకు చెందిన ఈ కన్నడ బ్యూటీ తమిళం, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. తమిళంలో సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చిన్ని చిన్ని ఆశ అనే చిత్రంతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు దాదాపు 40 సినిమాలు, 10 వెబ్ సిరీస్‌లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా? మరెవరో కాదు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ బాబుకు ప్రపోజ్ చేసే అమ్మాయి పాత్రలో కనిపించిన ధన్య బాలకృష్ణ. 

అయితే ఇవాళ చిల్డ్రన్స్‌ డే కావడంతో ధన్య తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన తండ్రి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటోను పంచుకుంటూ విషెస్ తెలిపింది. ఇది చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో నైస్ పిక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

 డైరెక్టర్‌తో పెళ్లి!

బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణ 2020 జనవరి నెలలోనే వివాహం చేసుకున్నారు. బాలాజీ మోహన్‌కిది రెండో పెళ్లి. అతను ఇదివరకే తన చిన్ననాటి స్నేహితురాలు అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ‘మారి’, ‘మారి 2’, ‘వాయై మూడి పేసవుం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలాజీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement