ఈ ఫోటోలోని టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా? | Tollywood actor Shares Teenage Pic with His Family | Sakshi
Sakshi News home page

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న తెలుగు నటుడిని గుర్తుపట్టారా?

Sep 28 2025 7:07 PM | Updated on Sep 28 2025 7:10 PM

Tollywood actor Shares Teenage Pic with His Family

చిన్నప్పుడు మనల్ని ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులను ఎలాగో తీసుకురాలేం కానీ.. ఆ జ్ఞాపకాలు మనతో పాటే ఉంటే ఎంత బాగుంటుంది. బాల్యం, యవ్వనంలో స్మృతులు ఎవరి జీవితంలోనైనా వెలకట్టలేనివే. అలాంటి క్షణాలు మనతో ఉండాలని కోరుకుంటాం. అదీ సాధ్యం కాకపోవచ్చు. ఆ జ్ఞాపకాలను గుర్తుగా కొన్ని ఫోటోలు ఉన్నా చాలు. వాటిని చూసి తెగ మురిసిపోతాం. అలాంటి జ్ఞాపకాన్నే మనతో పంచుకున్నారు టాలీవుడ్ యాక్టర్‌. ఇంతకీ ఆయనెవరో మీరు కూడా చూసేయండి.

తాజాగా మన టాలీవుడ్‌ నటుడు రాజీవ్ కనకాల తన చిన్ననాటి రోజులను ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. టీనేజ్‌లో ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న వాటిని ఒకసారి ‍అలా తిరగేస్తుంటే అనుకోకుండా కుటుంబంతో ఉన్న పాత ఫోటో కనిపించందని ట్వీట్ చేశారు. ఈ ఫోటోను చూసిన అందమైన క్షణం.. నా కుటుంబంతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిందని రాజీవ్ కనకాల రాసుకొచ్చాడు. మేమంతా ఒక కుటుంబంగా పంచుకున్న ప్రేమ, నవ్వుకు  ఈ చిన్ననాటి ఫోటో నిదర్శనమని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్‌ కాస్తా నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నటుడిగా మెప్పించిన రాజీవ్ కనకాల.. యాంకర్ సుమను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement