డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు | Thalapathy Vijay Son Jason Sanjay To Make His Directorial Debut With Lyca Productions - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay Son: హీరో అనుకుంటే.. దర్శకుడిగా మారి షాకిచ్చాడు!

Published Mon, Aug 28 2023 3:49 PM | Last Updated on Mon, Aug 28 2023 5:21 PM

Thalapathy Vijay Son Jason Sanjay Directorial Debut - Sakshi

దళపతి విజయ్‌ని తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిందే ఏం లేదు. పలు డబ్బింగ్ సినిమాలతో, సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. అయితే ఇతడికి 23 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడు హీరో అవుతాడనుకుని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్‌గా తొలి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

తమిళ హీరో దళపతి విజయ్‌కి ఇద్దరు పిల్లలు. అందులో కొడుకు జేసన్ సంజయ్ పెద్దోడు. ప్రస్తుతం అతడికి 23 ఏళ్లు. అయితే తండ్రిలానే హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలారోజుల నుంచి టాక్ నడుస్తోంది. 'ఉప్పెన' తమిళ రీమేక్‌తో నటుడిగా మారతాడని అప్పట్లో తెగ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ.. జేసన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో 'వెట్టైకారన్' సినిమాలో విజయ్-జేసన్ కలిసి నటించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?)

తమిళంలో పలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. జేసన్ సంజయ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తోంది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ మేటర్ కాస్త బయటపడింది. 

విజయ్ హీరోగా నటించిన 'లియో' త్వరలో రిలీజ్ కానుంది. దీని తర్వాత వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తారు. అనంతరం సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి, రాజకీయాల్లోకి వెళ్లిపోతారని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇతడి వారసుడిగా జేసన్ వస్తాడని ఫ్యాన్స్ అనుకుంటే.. ఇప్పుడు డైరెక్టర్ గా మారి షాకిచ్చాడు. బహుశా భవిష్యత్తులో ఏమైనా హీరో అవుతాడేమో చూడాలి.

(ఇదీ చదవండి: యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement