గుండెపోటుతో తెలుగు దర్శకుడు కన్నుమూత | Telugu Director Raghu Ram Passed Away | Sakshi
Sakshi News home page

Tollywood: దర్శకుడు, సీనియర్ జర్నలిస్టు మృతి

Apr 29 2026 2:22 PM | Updated on Apr 29 2026 2:36 PM

Telugu Director Raghu Ram Passed Away

తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం. దర్శకుడు రఘురామ్ చనిపోయారు. మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సహచరులు, పలువురు ఈయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

రచయిత, జర్నలిస్టు అయిన రఘురామ్.. ఈటీవీ, వీ6, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థల్లో ‍స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లాంటివి చేసినప్పటికీ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదట్లో సానా యాదిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్‌గా పనిచేశారు. 2004లో వచ్చిన 'వరం' మూవీతో దర్శకుడిగా మారారు. ఇది పెద్దగా మెప్పించలేకపోయింది.

గత కొన్నాళ్లుగా రైటర్, ఘోస్ట్ రైటర్‌గా పలు సినిమాలు చేస్తున్న ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన స్వస్థలం జగిత్యాల కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని మధురా నగర్‌లో ఉంటున్నారు. భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement