తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్‌ బ్లాస్ట్‌.. పాటలో డోస్‌ పెంచిన బ్యూటీస్‌ | Tamanna And Raashi Khanna's Panchuko Video Song Viral | Sakshi
Sakshi News home page

తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్‌ బ్లాస్ట్‌.. పాటలో డోస్‌ పెంచిన బ్యూటీస్‌

Published Sun, Apr 14 2024 11:58 AM | Last Updated on Sun, Apr 14 2024 12:19 PM

Tamanna And Raashi Khanna Video Song Viral - Sakshi

దర్శకుడు సుందర్‌ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్‌, ఏసీఎస్‌ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్‌ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు మేకర్స్‌..అందులో తమన్నా, రాశీఖన్నా అందాల ప్రదర్శనతో పోటీ పడ్డారు అని చెప్పవచ్చు. హిప్‌ హాప్‌ ఆది అందించిన మ్యూజిక్‌కు వారిద్దరూ గ్లామర్‌తో మ్యాజిక్‌ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ నుంచి వచ్చిన మూడు సీక్వెల్స్‌ భారీ హిట్‌ను అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో పార్ట్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్‌. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది.

తెలుగులో 'బాక్‌' అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఫైనల్‌గా ఏప్రిల్‌ 26న ఈ చిత్రం కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement