ఇలాంటి శరీరం తాప్సీకి మాత్రమే ఉంటుంది.. నటి ఘాటు రిప్లై | Sakshi
Sakshi News home page

ఇలాంటి శరీరం తాప్సీకి మాత్రమే ఉంటుంది.. నటి ఘాటు రిప్లై

Published Tue, Sep 21 2021 9:14 AM

Taapsee Pannus Sassy Reply To Tweet on Netizen Comment - Sakshi

తాప్సీకి పొగడ్తలు ఎలా తీసుకోవాలో, అలాగే అవమానాలకు ఎలా స్పందించాలో కూడా తెలుసు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘రష్మీ రాకెట్‌’. ఈ సినిమాలో గుజరాతీ స్పింటర్‌ రష్మీ పాత్రలో నటిస్తోంది. అథ్లెట్‌ బాడీ కోసం ఈ నటి పడిన కష్టానికి ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. 

‘మహాసముద్రం’ ట్రైలర్ రీలీజ్‌ ఎ​ప్పుడంటే..?

అయితే ఇటీవల ఆమె ఈ సినిమా సంబంధించిన వెనక్కి తిరిగి ఉన్న ఓ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ఎవరో చెప్పుకోండి?’ అంటూ క్యాప్షన్‌ని దానికి జోడించింది. దానికి ఓ నెటిజన్‌ ‘ఇలాంటి శరీరం తాప్సీ పన్నుకే ఉంటుంది’ అని ఇబ్బందికరమైన కామెంట్‌ పెట్టాడు.

ఆ కామెంట్‌కి ​స్పందించిన తాప్పీ.. ‘నేను చెబుతున్న.. ఈ లైన్ గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 23 వరకు వేచి ఉండు. నేను ఈ ప్రశంస కోసం చాలా కష్టపడ్డాను. మీకు ధన్యవాదాలు’ అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఈ విషయంలో ఆమె స్నేహితురాలు లక్ష్మీ మంచుతో పాటు ఎంతో మంది అభిమానులు ఈ బ్యూటీకి సపోర్టుగా కామెంట్స్‌ పెట్టారు. అయితే ఆమె సమాధానాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ట్రైలర్‌ గురువారం (సెప్టెంబర్ 23న) విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సినిమాని అక్టోబర్‌ 15న జీ5 యాప్‌లో విడుదల చేయనున్నారు.

పూర్తిగా కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌ 

Advertisement
Advertisement