
ఢిల్లీ నగరంలోని ప్రసిద్ధ కల్కాజీ ఆలయంలో జరిగిన ఘోరమైన సంఘటన గురించి బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్రంగా స్పందించారు. రెండురోజుల క్రితం ఆలయంలో ప్రసాదం పంపిణీ సమయంలో భక్తుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రసాదం స్టాక్ అయిపోయిందని ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్(35) చెప్పడంతో సహించలేని కొందరు యువకులు గొడవకు దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెద్దది కావడంతో యోగేంద్రను బయటకు లాగి, అతను చనిపోయేంత వరకు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. తను ప్రాణాలు వదిలేసిన సరే కర్రలతో కొడుతూనే ఉన్నారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటనపై నటి స్వర భాస్కర్ రియాక్ట్ అయ్యారు.
ఈ సంఘటనపై తాజాగా నటి స్వర భాస్కర్ ఇలా రియాక్ట్ అయ్యారు.' ఇది చాలా దారుణం, భయంకరమైన సంఘటన. ప్రజలను కొట్టి చంపడం భారతదేశంలో ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. అందరికీ చిరాకు తెప్పించేలా ఉంది. సిగ్గుచేటు, మన సమాజం గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. మనం రాక్షసులుగా మారిపోయాం.' అని ఆమె రాసింది.
దాడిలో తీవ్రంగా గాయపడిన యోగేంద్ర సింగ్‌ను AIIMS ట్రామా సెంటర్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం మొత్తం అతనిపైనే ఆధారపడి జీవిస్తుంది. CCTV ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక నిందితుడు అతుల్ పాండేను అరెస్ట్ చేశారు, మరిన్ని అరెస్టులు జరుగుతున్నాయి.
Warning ⚠️ This video is from Kalkaji Mandir where people murdered seva dar for not giving chunni in parsad. These people are seriously mad. Strict action should be taken. #KalkajiMandir #kalkaji #KalkajiTemple #Delhi #DelhiNCR #delhi @gupta_rekha pic.twitter.com/Xp6cvbtAQu
— Sachin Bharadwaj (@sbgreen17) August 30, 2025