ముకుటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సూర్య | Suriya Visits Makuteswara Temple in Tamil Nadu | Sakshi
Sakshi News home page

Suriya: పంచెకట్టులో ఆలయానికి వెళ్లిన సూర్య

Apr 5 2024 1:50 PM | Updated on Apr 5 2024 1:50 PM

Suriya Visits Makuteswara Temple in Tamil Nadu - Sakshi

కథానాయకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్నారు సూర్య. అంతేకాదు ఈ రెండింటిలోనూ విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన కంగువ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా యూవీ.క్రియేషన్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. కాగా సూర్య తన 44వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు.

అలాగే సూరరై పోట్రు చిత్రం ఫేమ్‌ సుధాకొంగర దర్శకత్వంలోనూ మరో చిత్రం చేయనున్నారు. ఇక లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రోలెక్స్‌ చిత్రం కూడా లైన్‌లో ఉంది. ఈ క్రమంలో సూర్య బుధవారం నాడు ఈరోడ్‌ జిల్లా, కొడుముడియల ప్రాంతంలో గల మకుటేశ్వర ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. కాగా సూర్య ఆ ఆలయానికి వస్తున్న విషయం తెలియడంతో ఆ ప్రాంత ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల భద్రత మధ్య సూర్య చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అభివాదం చేస్తూ వెళ్లారు.

చదవండి: నేషనల్‌ క్రష్‌ ఏం చేసినా ట్రోలింగ్‌.. చేతలతో జవాబు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement