బర్త్‌డే వేడుకల్లో కూతురుతో కలిసి సురేఖ రచ్చ రచ్చ .. ఫోటోలు వైరల్‌

Surekha Vani Birthday Celebrations: Enjoyed Night Party With Friends And Daughter - Sakshi

పేరుకు క్యారెక్టర్‌ఆర్టిస్ట్‌ అయినా..హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది నటి సురేఖ వాణి. అందంతో పాటు ఆకట్టుకునే నటనతో టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసుకుంది. కామెడీ పాత్రతైనా, ఎమోషనల్‌ పాత్రలైనా అవలీలగా చేయగలదు. హీరోహీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య సిసిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది. వెండి తెరపై ఎక్కువగా సాంప్రదాయబద్దమైన పాత్రల్లో కనిపించే సురేఖ వాణి.. రియల్‌ లైఫ్‌లో మాత్రం ఎక్కువగా ట్రెడిషినల్‌ లుక్‌లోనే కనిపిస్తుంటారు.

కూతురు సుప్రితతో కలిసి సోషల్‌ మీడియాలో సురేఖ చేసే రచ్చ అంతా ఇంత కాదు. పొట్టి దుస్తుల్లో ఉన్న వీరిద్దరి ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సురేఖ బర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

నేడు (ఏప్రిల్‌ 29) సురేఖవాణి 40వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి కూతురు సుప్రిత, అత్యంత సన్నిహితులతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసినందుకు సోషల్‌ మీడియా వేదికగా కూతురు సుప్రితకు ధన్యవాదాలు చెప్పింది సురేఖ. ‘నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి, ఆనందం ఇంకోటి లేదు.నా బలం, బలహీనత అన్ని నువ్వే’అని కామెంట్ చేసింది. ప్రస్తుతం సురేఖవాణికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, గతేడాది సురేఖా వాణి భర్త సురేష్ తేజ మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురుతో కలిసి ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top