
ఇటీవలి కాలంలో ఓటీటీలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం అందించేందుకు సిద్ధమయ్యింది సన్ షైన్ ఓటిటి యాప్. లాంచింగ్ వేడుక హైదరాబాద్‌లోని దస్ పల్లా హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్,యువ హీరో రాం కార్తీక్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటిటి వ్యవస్థాపకుడు శివప్రసాద్ మాట్లాడుతూ..మా సన్ షైన్ ఓటిటి ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.
ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్,లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాం. భవిష్యత్‌లో మరిన్ని సేవలు అందించడం జరుగుతుంది అని అన్నారు.
హీరో రామ్ కార్తిక్ మాట్లాడుతూ.. ఇప్పటికే మార్కెట్ లో చాలా ఓటిటి లు వచ్చాయి. ఎన్ని ఓటిటిలు వచ్చినా కంటెంట్ ఉన్న ఓటిటి లకు ప్రేక్షకాదరణ లభిస్తుందనే విషయాన్ని ప్రేక్షకులు నిరూపించారు. అలాగే ఇప్పుడు మంచి కంటెంట్ తో వచ్చిన "సన్ షైన్" ఓటిటి ని కూడా ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.