‘కనబడుటలేదు’ రిలీజ్‌కు సిద్ధం

Sunils Kanabadutaledu Movie All Set To Release - Sakshi

బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): హీరో సునీల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కనబడుటలేదు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సిరిపురంలోని వీఎంఆర్డీఏ చి్రల్డన్‌ ఎరీనాలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ పాల్గొని.. సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రంలో నటించిన నటుల్లో ఎక్కువ మంది నగరానికి చెందిన వారు కావడం సంతోషకరమన్నారు. నిర్మాత సతీష్‌రాజు మాట్లాడుతూ కనబడుటలేదు చిత్రాన్ని ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వర్ధమాన గాయకుడు యశస్వి పలు సినీగీతాలను ఆలపించి.. ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో దర్శకుడు బాలరాజు, హీరోయిన్‌ వైశాలి రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top