
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ మార్కో పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఇప్పుడదే బ్యానర్‌పై ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ మరో భారీ ప్రాజెక్ట్ కాటాలన్‌ను లాంచ్ చేశారు. మలయాళం, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో జరిగింది. బాహుబలిలో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు పూజా కార్యక్రమంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
లగ్జరీ కార్లు, బైక్‌లు కూడా ఈవెంట్‌ను మరింత స్పెషల్ చేశాయి. సినిమాలోని కథ లైన్‌ను దృష్టిలో పెట్టుకుని పూజా ప్రెజెంటేషన్ కూడా డిజైన్ చేశారు. హీరోయిన్‌గా రాజిషా విజయన్ నటించనున్నారు. తెలుగు నటుడు సునీల్, ‘మార్కో’ ఫేమ్ కబీర్ దూహన్ సింగ్, వ్లాగర్-సింగర్ హనన్ షా, ర్యాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు, జగదీష్, సిద్దిక్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సుమారు ₹45 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయ్యింది. డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 1, బాహుబలి 2, జవాన్, బాఘీ 2 వంటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేసిన వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్ కేచా ఖాంఫక్డీ ఈ సినిమాలో కూడా స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.