'గర్ల్ ఫ్రెండు ఏమి చేసినా గారాభంగా ఉంటాదే'.. | Sukumar Releases Siggu Endukura Mama Song From SR Kalyanamandapam | Sakshi
Sakshi News home page

SR కళ్యాణమండపం నుంచి సాంగ్‌ను రిలీజ్‌ చేసిన సుకుమార్‌

Jun 22 2021 3:49 PM | Updated on Jun 22 2021 8:05 PM

Sukumar Releases Siggu Endukura Mama Song From SR Kalyanamandapam - Sakshi

కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'SR కళ్యాణమండపం EST.1975'. శ్రీధర్ గాదే ఈ సినమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని  'సిగ్గేందుకురా మామ' అనే సాంగ్‌ను డైరెక్టర్‌ సుకుమార్‌ రిలీజ్‌ చేశారు. 'తిట్టినా బాగుంటాదే.. కొట్టినా బాగుంటాదే.. గర్ల్ ఫ్రెండు ఏమి చేసినా గారాభంగా ఉంటాదే..' అంటూ ట్రెండీ అండ్‌ పెప్పీ వెర్షన్‌లో సాగుతున్నఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.

అనురాగ్ కులకుర్ణి ఈ పాటను ఆలపించాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇప్పటికే విడుదలైన 'చూసాలే కళ్లారా', 'చుక్కల చున్నీనే' అనే పాటలు ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వస్తోన్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. 

చదవండి : మంచు లక్ష్మీ మాస్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌
‘కిరాతక’గా ఆది సాయికుమార్‌.. పాయల్‌తో రొమాన్స్‌కి రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement