Jr NTR-Team India: భారత ఆటగాళ్లతో తారక్‌ సందడి, ఫొటో వైరల్‌!

Star Hero Jr NTR With Team India Photo Goes Viral - Sakshi

గతేడాది ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన తారక్‌ ఇండియాకు తిరిగి వచ్చాడు. క్రిస్మస్‌ సందర్భంగా విదేశాలకు వెళ్లిన యంగ్‌ టైగర్‌ న్యూ ఇయర్‌ను అక్కడే సెలబ్రెట్‌ చేసుకున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించిన సందర్భంగా మూవీ టీం, రామ్‌ చరణ్‌తో పాటు తన భార్య ప్రణతితో కలిసి అమెరికాలో సందడి చేశాడు. ఇక ఈ సందడి అనంతరం ఎన్టీఆర్‌ ఇండియాకు తిరిగొచ్చాడు.
చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్‌ చేసిన స్టార్‌ యాంకర్‌! అసలేం జరిగిందంటే..

అయితే తాజాగా తారక్‌ను టీమిండియా కలిసిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం భారత జట్టు హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత జట్టులోని పలువురు క్రికెటర్లు తారక్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, శార్దుల్, శుభమాన్ గిల్‌తో పాటు పలువురు ఉన్నారు. అయితే వీరు ఎక్కడ కలిశారన్నది మాత్రం క్లారిటీ లేదు. వారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్‌ లైటింగ్‌ సెట్‌, కార్లు ఉన్నాయి.
చదవండి: విజయ్‌ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్‌?

చూస్తుంటే ఇది ఓ లగ్జరీ కారు షోరూంలా కనిపిస్తోంది!. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా సోమవారం (జనవరి 16న) హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. తొలుత వన్డే సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జనవరి18న (బుధవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్న భారత జట్టు హైదరాబాద్‌ చేరుకుంది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top