కీర్తి ‘శాశ్వత్‌’ o చేసిన ధురంధర్‌! | Special Story On Dhurandhar Music Director Shashwat Sachdev | Sakshi
Sakshi News home page

పాత పాటల హుషార్‌... బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌.. ఎవరీ శాశ్వత్ సచ్‌దేవ్?

Apr 1 2026 4:09 PM | Updated on Apr 1 2026 4:37 PM

Special Story On Dhurandhar Music Director Shashwat Sachdev

నటీనటులైనా, దర్శకుడైనా, సాంకేతిక నిపుణులైనా... చిత్ర పరిశ్రమలో ఏ కళాకారుడికైనా ఒక పెద్ద విజయం  కుదుపుని ఇస్తుంది కెరీర్‌కు మలుపును అందిస్తుంది.  రాత్రికి రాత్రే  తలరాతలను మార్చేయగల శక్తి ఒక్క సినిమా విజయానికి ఉంది. అదీ బాలీవుడ్‌ రికార్డులను బద్దలుకొట్టిన స్వదేశీ స్పై థ్రిల్లర్‌ ’ధురందర్‌’ లాంటి సినిమా అయితే ఇక చెప్పేదేముంది? సంచలన విజయం సాధించిన ఈ సినిమా దానితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి కెరీర్‌ను అనూహ్యమైన కుదుపుని అందించింది.

వీరందరిలో, ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలలకూ మ్యూజిక్‌ని ఇచ్చిన సంగీత దర్శకుడు శాశ్వత్‌ సచ్‌దేవ్‌ ముందున్నారు. దర్శకుడి తర్వాత ఆయన పేరే ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ధురందర్‌ ఇటీవల విడుదలైన దాని సీక్వెల్‌ విజయాలకు ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నప్పటికీ, ఈ వర్ధమాన సంగీతకారుడు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం రెండు భాగాలకూ ప్రధాన ఆకర్షణగా నిలిచి, వాటిని బ్లాక్‌బస్టర్‌లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.

గతంలో ఆదిత్య ధర్‌తో కలిసి ’ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ చిత్రానికి కూడా శాశ్వత్‌ పనిచేశారు  తన అద్భుతమైన స్వరకల్పనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జాతీయ  ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు రెండింటినీ గెలుచుకుని బాలీవుడ్‌కు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ధురందర్‌ చిత్రంతో, తాను  రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని ఆయన మరోసారి చాటి చెప్పారు. 

«అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశాల్లో అనూహ్యంగా పాత బాలీవుడ్‌ పాటల్ని జోడిస్తూ దురందర్‌ చిత్రాల్లో.. శాశ్వత్‌  చేసిన కొత్త ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయింది. సినిమా కథనంతో సజావుగా కలిసిపోయిన ఒకనాటి మ్యూజికల్‌ హిట్స్‌ ప్రేక్షకులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చాయి. ఆయన  వ్యూహం అద్భుతంగా ఫలించింది.

కేవలం నేపథ్య సంగీతంలోనే కాకుండా, ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఐదు రెట్రో పాటలతో కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చినప్పుడు, క్లాసిక్‌ పాటలపై ఆయనకున్న అభిరుచి మరోసారి స్పష్టమైంది. దివంగత నుస్రత్‌ ఫతే అలీ ఖాన్‌ పాట దిల్‌ పే జఖ్మ్‌ ఖతే హై (1977), దిల్‌ (1990) నుంచి హమ్‌ ప్యార్‌ కర్నే వాలే (1990), తానేదార్‌ నుంచి తమ్మా తమ్మా (1990), త్రిదేవ్‌ నుంచి తిర్చీ టోపీవాలే (1989), అంగారే నుంచి ముజే జిందగీ నే మారా (1986) అలాగే బాజీగర్‌ (1993) నుంచి...పాటల్ని అద్భుతంగా కలగలిపారు.

రణ్‌వీర్‌ సింగ్‌ తన అవార్డ్‌ విన్నింగ్‌ పెర్ఫార్మె న్స్ కి మెజారిటీ అవార్డులతో దూరంగా ఉండగా, ఆదిత్య ధర్‌ ఇప్పుడు కేవలం మూడు నెలల్లో రెండు అద్భుతమైన సినిమాలను అందించినందుకు పాన్‌–ఇండియా సంచలనంగా మారాడు. అదే విధంగా ప్రస్తుతం శాశ్వత్‌ అందించిన అద్భుతమైన సంగీతంతో చార్ట్స్‌లో టాప్‌లో నిలిచాడు.  

ఉత్సాహపరిచే డ్యాన్స్ నంబర్లు, స్టైలిష్‌ ఇంట్రో పాటలపై ఆధారపడే ఆధునిక సంగీత దర్శకుల్లా కాకుండా ఆయన సంగీతంలో తనదైన ప్రత్యేక శైలితో  భిన్నంగా వెళ్లడం, తన సొంత నియమాల ప్రకారం పనిచేయడం ఆయన్ను  బాలీవుడ్‌లో తదుపరి పెద్ద స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మార్చింది. ఈ నేపధ్యంలో త్వరలోనే దక్షిణాది చిత్రసీమలో  అడుగుపెట్టే అవకాశం కూడా ఆయనకు రానున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement