పండుగరోజే గృహప్రవేశం చేసిన స్టార్ హీరోయిన్! | Sakshi
Sakshi News home page

Bollywood Actress: పండుగరోజే గృహప్రవేశం చేసిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

Published Mon, Oct 23 2023 4:32 PM

Sonam Kapoor Shifts To Her New Home On Vijaya Dasami In Mumbai - Sakshi

 బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2005లో బ్లాక్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా  భన్సాలీకి సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన సావరియా సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం  చేశారామె. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటిగా పురస్కారం లభించింది.

(ఇది చదవండి: కావాలయ్యా సాంగ్‌.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు)

అయితే తాజాగా ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. విజయదశమి సందర్భంగా గృహప్రవేశం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. సోనమ్ కపూర్ అహూజా పండుగ రోజే ముంబయిలోని కొత్త ఇంటికి చేరింది. ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్‌కు ఏడాది వయసున్న వాయు కపూర్ అహుజా అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోనమ్‌కు అభినందనలు చెబుతున్నారు. 

సోనమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మేము ఈ వారంలో మా కొత్త ఇంటికి మారాం . ఇప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా మనసులు ఆశతో నిండి ఉన్నాయి. ఇక్కడ కొత్త జ్ఞాపకాలను కోసం మేము వేచి ఉండలేము' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో పాటు తాను ఇంట్లో కూర్చొని ఉన్న అందమైన ఫోటోలు పంచుకుంది.

(ఇది చదవండి: ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement