మెగాస్టార్‌తో బాలీవుడ్‌ భామ రొమాన్స్‌!

Sonakshi Sinha Will Team Up With Chiranjeevi Next Movie - Sakshi

డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర అలియాస్‌ బాబీ-మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్‌, యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో బాబీ, చిరు కోసం ప్రత్యేకంగా రేడి చేసిన ఈ స్క్రిప్ట్‌ చిరుకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడు. అంతేగాక బాబీతో ఓ మూవీ చేయబోతున్న అంటూ మెగాస్టార్‌ స్వయంగా ప్రకటించడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అసక్తికర అప్‌డేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఇందులో చిరుకు జోడీగా బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ టీం సోనాక్షిని సంప్రదించి కథ వివరించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మెగాస్టార్‌ మోహ‌న్ రాజా డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌బోయే లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించ‌నున్నాడు. అనంతరం బాబీతో సినిమాను చిరు ప్రారంభించనున్నాడు. కాగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top