
ప్రముఖ గాయని చిత్ర తన కుమార్తె జయంతి సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా కూతురికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా ఫోటోను షేర్ చేస్తూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
ట్విటర్‌లో చిత్ర రాస్తూ.. 'స్వర్గంలో దేవ కన్యలతో వేడుకలు జరుపుకుంటున్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నేళ్లు గడిచినా నీ వయసు పెరగదు. నాకు దూరంగా ఉన్నా క్షేమంగా ఉన్నావని నాకు తెలుసు. నిన్ను ఎంతో మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ నందన.' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. కాగా.. 2011లో దుబాయ్‌లో ఉండగా నందన(8) స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించింది.
— K S Chithra (@KSChithra) December 18, 2022