కొరియోగ్రాఫర్ జానీ కేసు.. సింగర్ చిన్మయి మరో సంచలన ట్వీట్! | Singer Chinmayi tweet on choreographer jani master | Sakshi
Sakshi News home page

Singer Chinmayi: కొరియోగ్రాఫర్ జానీ కేసు.. సింగర్ చిన్మయి మరో సంచలన ట్వీట్!

Nov 12 2025 6:36 PM | Updated on Nov 12 2025 7:33 PM

Singer Chinmayi tweet on choreographer jani master

సింగర్ చిన్మయి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న దారుణాలపై పోరాటం చేస్తున్న సింగర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్‌పై చిన్మయి హైదరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

అయితే కొద్ది రోజుల క్రితమే మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయంటూ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌తో పాటు మరో కోలీవుడ్ సింగర్ కార్తీక్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇలాంటి వారికి అవకాశాలివ్వడం అంటే లైంగిక దాడులను ప్రోత్సహించడమేనంటూ సంచలన పోస్ట్ చేసింది. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా వదిలిపెట్టదని సింగర్‌ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

‍తాజాగా జానీ మాస్టర్‌ను ఉద్దేశించి సింగర్ చేసి తాజా ట్వీట్‌ టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్టర్ కేసు అత్యంత సంక్లిష్టమైనదంటూ పేర్కొంది. అతను మైనర్‌ను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా.. అంగీకరించలేదని బెదిరించాడని సింగర్ తెలిపింది. ఇక్కడ మాత్రం వీరిద్దరిది ఏకాభిప్రాయ రిలేషన్‌ అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. అయితే 16 ఏళ్ల మైనర్ అమ్మాయి సమ్మతి ఇవ్వలేదనే విషయాన్ని వారు అర్థం చేసుకోవాలని చిన్మయి మండిపడింది. ఒక అడల్ట్ వ్యక్తి.. మైనర్‌తో రిలేషన్ పెట్టుకోవద్దనే బాధ్యత కలిగి ఉండాలని గుర్తు చేసింది.

కానీ ఇక్కడ జానీ మాస్టర్ రిచ్‌.. అతనికి ఎంతోమంది పెద్దవాళ్లతో సంబంధాలు ఉండొచ్చని వెల్లడించింది. అందుకే ఈ వ్యవస్థలో బాధిత అమ్మాయికి న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువని సింగర్ పోస్ట్ చేసింది. నేను ఈ సమస్య గురించి మాట్లాడి ప్రతిసారీ.. అతని భార్య ఈ విషయం గురించి మాట్లాడవద్దని చెబుతోందని ఆరోపించింది. ఎందుకంటే ఇక్కడ వాళ్లు నిర్దోషిగా బయటపడతారని వందశాతం ధీమాతో ఉన్నారని.. మీ ఆత్మవిశ్వానికి నా శుభాకాంక్షలు అంటూ చిన్మయి వ్యంగ్యంగా రాసుకొచ్చింది. 

అవార్డుల మీద అవార్డులు

ఈ కేసులో జానీ మాస్టర్‌  నిర్దోషి అని తెలితే.. వెంటనే అతనికి అవార్డుల మీద అవార్డులు కూడా ఇస్తారని సింగర్ తెలిపింది. ఎక్కువ మంది మైనర్లను వేధించడం.. వాటి నుంచి తప్పించుకోవడానికి ఏమి చేయాలో వారికి కచ్చితంగా తెలుస్తుందని ట్విటర్‌లో రాసుకొచ్చింది. అన్నింటికంటే కొంతమంది పురుషులకు మైనర్లతో లైంగిక చర్యలో పాల్గొనేలా చేయడం ఒక థ్రిల్‌గా భావిస్తారని తెలిపింది. ఈ కేసులో నేను ఆశించేది ఏంటంటే.. ఆ  అమ్మాయి గెలిచి.. తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి.. ఈ సమాజానికి కళ్లు తెరిపించాలని చిన్మయి సుదీర్ఘ పోస్ట్ చేసింది. 

జానీపై లైంగిక దాడి కేసు

కాగా.. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై గతేడాది లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో జానీ మాస్టర్‌ను గోవాలో పోలీసులు అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అమ్మాయి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలా ఏళ్లుగా తనను వేధించడం, బెదిరించడం చేశాడని ఆరోపించింది. అమ్మాయికి 16 ఏళ్ల వయసు నుంచే వేధింపులకు పాల్పడ్డారని చెప్పడంతో పోక్సో కేసు కూడా నమోదు చేశారు. కాగా.. ప్రస్తుతం జానీ బెయిల్‌పై బయట ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement