
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి(Shilpa Shetty) సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై బాంద్రాలో ఉన్న తన లగ్జరీ రెస్టారెంట్ ‘బాస్టియన్’ను (Bastian) మూసివేయనున్నట్లు ప్రకటించింది. గత కొద్దిరోజుల క్రితమే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రూ.60 కోట్ల మేర మోసం చేశారంటూ ఒక వ్యాపారావేత ఆరోపణలు చేశాడు. ఆపై వారిమీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు.
"ముంబైలోని అత్యంత పేరుగాంచిన మా రెస్టారెంట్ బాస్టియన్‌ను ఈ గురువారం మూసివేస్తున్నాం. ఒక శకం ముగిసింది. ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, మరపురాని క్షణాలను ఇచ్చింది. ఎందరికో సంతోషాన్ని పంచిన ఈ వేదిక ఇకపై మూతపడనుంది. వీడ్కోలు పలికేందుకు గురువారం ఒక వేడుక నిర్వహిస్తున్నాం. వ్యాపార భాగస్వాములతో పాటు కొందరు సన్నిహితులు కూడా హాజరుకానున్నారు. త్వరలో సరికొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాం.' అని ఆమె తెలిపారు.
ముంబైలో ఆరుచోట్ల బాస్టియన్ పేరుతో వారికి బ్రాంచ్లు ఉన్నాయి. 2016లో ముంబై బాంద్రాలో ప్రారంభమైన మొదటి బ్రాంచ్ను వారు మూసివేస్తున్నారు. కారణం ఏంటి అనేది వారు చెప్పలేదు. కానీ, మూసివేతకు ప్రధాన కారణం రూ.60 కోట్ల మోసం కేసు అని తెలుస్తోంది.అయితే, శిల్పా శెట్టి తన సినిమా కెరీర్‌తో పాటు ఫుడ్, హాస్పిటాలిటీ రంగంలో కూడా తన మార్క్ వేసింది.