గత మూడేళ్లలో ఒక్కటంటే ఒక్కటే సినిమా చేశాడు హీరో శర్వానంద్. అది 'మనమే'. గతేడాది రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'బైకర్'. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు సడన్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గ్లింప్స్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: నవంబర్ బాక్సాఫీస్.. అందరికీ చాలా కీలకం)
మట్టిలో బైక్ రేసింగ్ అనేది విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఓ బైకర్ కథతో తీసిన సినిమాలా ఇది అనిపిస్తుంది. విజువల్స్, డైలాగ్స్ అయితే బాగున్నాయి. అభిలాష్ కంకర అనే దర్శకుడు కాగా గిబ్రాన్ సంగీతమందించాడు. మాళవిక నాయర్ హీరోయిన్. డిసెంబరు 6న 'బైకర్' చిత్రం థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.
డిసెంబరు 5న 'అఖండ 2' రిలీజ్ కానుంది. దీనికి పోటీగా వేరే సినిమాలేం లేవు. లెక్క ప్రకారమైతే ఈ తేదీన 'రాజాసాబ్' రావాలి. కానీ సంక్రాంతికి వాయిదా వేయడంతో ఇప్పుడు ఆ ప్లేసులోకి 'బైకర్' వచ్చింది. మరి శర్వానంద్ ఈసారైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడా? లేదా అనేది చూడాలి.
(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)


