Actor Santosh Sobhan Write Emotional Letter To Fans Over His Movie Career - Sakshi
Sakshi News home page

Santosh Sobhan: సినిమా ఫ్లాప్‌... అభిమానులకు యంగ్‌ హీరో ఎమోషనల్‌ లేఖ

Nov 12 2022 1:44 PM | Updated on Nov 12 2022 3:33 PM

Santosh Sobhan Write Emotional Letter To Fans - Sakshi

ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్‌ హీరో హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్..తను నేను చిత్రంతో హీరోగా  మారాడు.  ‘పేపర్ బాయ్’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.  ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇటీవల లైక్  షేర్ అండ్‌ సబ్స్క్రైబ్ చిత్రంతో ప్రేక్షకులతో  ముందుకు రాగా.. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా సంతోష్‌ శోభన్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు ఓ లేఖ రాశాడు. 

‘నేను 2010లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. నా ఫేవరేట్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో గోల్కొండ హైస్కూల్ చిత్రంలో నటించాను. ఈ సినిమాలో నా డైలాగ్స్ చెప్పినప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. నేను నా కలను సాకారం చేసుకున్న అనుభూతి కలిగింది. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు కెమెరా ముందుకొచ్చినా నా డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నానని ఆనందపడుతుంటా. ఇదే ఆనందాన్ని నిత్యం పొందేందుకు మంచి కథల్లో నటిస్తూ, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నాను’ అని సంతోష్‌ శోభన్‌ రాసుకొచ్చాడు.

సంతోష్ శోభన్ ప్రస్తుతం ప్రేమ్ కుమార్ అనే సినిమాతో పాటు యూవీ క్రియేషన్స్ లో రెండు ప్రాజెక్ట్స్ లకు ప్లానింగ్ జరుగుతోంది. ఒక సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ కు రెడీ గా ఉండగా,మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మాణంలో నందినీరెడ్డి దర్శకత్వంలో "అన్ని మంచి శకునములే" అనే సినిమాలో సంతోష్ శోభన్ నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement