Samantha Changes Her Name In All Social Media Accounts | ChaySam Divorce - Sakshi
Sakshi News home page

ChaySam Divorce: పేరు మార్చుకున్న సమంత!

Oct 3 2021 1:47 PM | Updated on Oct 3 2021 3:20 PM

Samantha Changes Her Name In All Social Media Accounts - Sakshi

2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. తన పేరుకు అక్కినేని చేర్చుకొని  సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. 

సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ సమంత మరోసారి తన పేరును మార్చుకుంది. నిన్నటి వరకు  ఎస్(S) అనే అక్షరాన్ని మాత్రమే ఉంచిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు మళ్ళీ సమంత(Samantha)అని పేరును మార్చింది. నాగ చైతన్యతో పెళ్ళికి ముందు సమంత సోషల్ మీడియా ఖాతాలకు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. కానీ, 2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. తన పేరుకు అక్కినేని చేర్చుకొని  సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. 

ఇటీవల ఆ పేరును తొలగించి ఎస్‌(S)అని మార్చుకోవడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లేనే నిజం చేస్తూ తామిద్దరం విడిపోతున్నామని చైతు-సమంత శనివారం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఇలా విడిపోయిన మరుసటి రోజే సమంత పేరు మార్చేయడం కూడా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారుతుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement