సమంత సలహాపై విమర్శలు.. ఈ పని అ‍ప్పుడే చేయాల్సింది! | Samantha Adds Disclaimer To Her Health Podcast After Getting Slammed, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Samantha: సమంత వైద్య సలహాపై విమర్శలు.. ఈ జాగ్రత్త అప్పుడే ఉండాల్సింది!

Jul 29 2024 8:53 PM | Updated on Oct 18 2024 11:11 AM

Samantha adds disclaimer to her health podcast after getting slammed

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్‌కు జోడీగా కనిపించనుంది. ఆ తర్వాత మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటించనుంది. గతేడాది చివరిసారిగా ఖుషీ చిత్రంలో కనిపించింది సామ్. మయోసైటిస్‌ నుంచి కోలుకున్నాక ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఫుల్ యాక్టివ్‌ అవుతోంది.

గతంలో మయోసైటిస్‌ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆరోగ్యానికి సంబంధించి పాడ్‌కాస్ట్‌లు విడుదల చేస్తోంది. కొద్ది రోజుల క్రిత ఆమె ఇచ్చిన వైద్య సలహాపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. నెబ్యులైజేషన్‌ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించాలంటూ సమంత సూచించింది. అయితే దీనిపై కొంతమంది వైద్యులతో పాటు పలువురు సమంత సలహాను తప్పుబట్టారు.

అయితే సమంత తాజాగా మరో పాడ్‌కాస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా పంచుకుంది. అయితే ఈ సారి ముందు జాగ్రత్తగా డిస్‌క్లైమర్‌ను కూడా రాసుకొచ్చింది. ఈ ఎపిసోడ్‌లో ఉన్న ఆడియో, టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజ్‌లు కేవలం సమాచారం కోసమేనని తెలిపింది. ఈ ఎపిసోడ్‌లోని అంశాలు వైద్య సలహా, రోగ నిర్ధారణ, చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించింది కాదు..  వైద్య చికిత్సకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించండి అంటూ డిస్‌క్లైమర్‌లో వివరించింది. కాగా.. గతంలో తన సలహాపై పెద్దఎత్తున విమర్శలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మరోసారి విమర్శలు రాకుండా సమంత జాగ్రత్త పడిందని మరికొందరు అంటున్నారు. కాగా.. సమంత రూత్ ప్రభు టేక్ -20 అనే పేరుతో హెల్త్ పాడ్‌క్యాస్ట్‌ని నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement