Salaar X Review: ‘సలార్‌’మూవీ ట్విటర్‌ రివ్యూ | Salaar Movie Twitter Review In Telugu | Sakshi
Sakshi News home page

Salaar X Review: సలార్‌ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..?

Dec 22 2023 5:02 AM | Updated on Dec 22 2023 10:47 AM

Salaar Movie Twitter Review In Telugu - Sakshi

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్‌ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీయఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం కావడం..పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చాలా కాలం తర్వాత మళ్లీ మాస్‌ లుక్‌లో కనిపించడంతో సలార్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు, పాటలు సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ సీనీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాయి. 

భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్పెషల్‌ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 


సలార్‌ కథేంటి? ఎలా ఉంది? ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు. 

ఎక్స్‌లో సలార్‌ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌, పృథ్విరాజ్‌ సుకుమార్‌ల యాక్టింగ్‌ అదిరిపోయిందని అంటున్నారు. ప్రశాంత్‌ టేకింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. భారీ బ్లాక్‌ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని కామెంట్‌ చేస్తున్నారు.  మరికొంత మంది అయితే ఇది యావరేజ్‌ మూవీ అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement