ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ చేయండి.. సాయం చేస్తా: రేణు దేశాయ్‌

Renu Desai Keeps Her Inbox Open In Order To Help Those In Need - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి రోజురోజుకూ ఉధృతం అవుతోంది. హాస్పిటల్‌లో బెడ్స్‌ దొరక్క పోవడం, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారికి నా వంతు సాయం చేస్తానంటున్నారు నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ– ‘‘సోషల్‌ మీడియాను సినిమా ప్రమోషన్స్‌ కోసం వాడుకునే వాళ్లు కూడా గత పదిహేను రోజులుగా కోవిడ్‌ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుండటం సంతోషం.

నా ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ ఇన్‌ బాక్స్‌ ఇప్పటి నుంచి ఓపెన్‌లో పెడతా. ప్లాస్మా లేదా ఆక్సిజన్‌ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్‌ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే నాకు మెసేజ్‌ చేస్తే, వారికి సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్‌ ద్వారా కాంటాక్ట్‌ అవ్వాలి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయం మాత్రం చేయలేను’’ అన్నారు.  చదవండి:  (అబ్బురపరిచే అమ్మాయి... అవ్‌నీత్‌ కౌర్‌!) 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top