
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. కల్కి సూపర్ హిట్ కావడంపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ప్రభాస్ మాట్లాడుతూ..' ఇంత పెద్ద హిట్ అందించినందుకు మీకు ఫ్యాన్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను జీరోనే. థ్యాంక్ యూ నాగ్ అశ్విన్. దాదాపు మాది ఐదేళ్ల ప్రయాణం. ఇంత పెద్ద సినిమాను అందించినందుకు వైజయంతి మూవీస్, నిర్మాతలకు నా ధన్యవాదాలు. అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అలాగే దీపికా, కమల్ సార్, అమితాబ్ సార్, దిశా పటానీకి మనస్ఫూర్తిగా నా అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్‌లో ది రాజాసాబ్‌లో కనిపించనున్నారు.
WE HAVE MUCH BIGGER PART 2 🔥
A sweet note from Rebel star #Prabhas, celebrating the blockbuster success of #Kalki2898AD ❤️#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/g5CdfE9a1E— Telugu FilmNagar (@telugufilmnagar) July 14, 2024