రైడ్‌లో పట్టుబడ్డ దక్షిణాది పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు

Rave Party Busted In Maharashtras Nashik, Ex-Big Boss Contestant Arrested - Sakshi

నాసిక్‌లో రేవ్‌ పార్టీ : 22మంది అరెస్ట్‌

భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం..నిందితులపై కేసు నమోదు 

సాక్షి, ముంబై:  నాసిక్‌లోని ఇగాత్‌పురిలోని విల్లాల్లో నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీపై పోలీసులు దాడులు జరిపారు. వీరిలో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌తో పాటు దక్షిణాది పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించారు.  పోలీసులు అందించిన వివరాల మేరకు...నాసిక్‌లోని స్కై తాజ్‌,  స్కై లగూన్ అనే రెండు ఖరీధైన విల్ల్లాల్లో రేవ్‌ పార్టీ నిర్వహించారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రైడ్‌లో 22మందిని అరెస్ట్‌ చేశారు. అప్పటికే యువతీ యువకులంతా మద్యం మత్తులో, ఒళ్లు మరిచిన అసభ్యకరమైన స్థితిలో ఉన్నారు. వారిలో 10మంది పురుషులు కాగా, 12 మంది ఆడవాళ్లు ఉన్నారు. వారి నుంచి పోలీసులు భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి పక్కనే పెద్దమొత్తంలో విదేశీ మద్యం సీసాలు, హుక్కాలు పడి ఉన్నాయి.


దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్నవారందరినీ అరెస్టు చేశారు. అయితే ఓ మహిళ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నలుగురు యువతులు దక్షిణాది పరిశ్రమతో సంబంధం ఉన్నవారిగా గుర్తించారు. వీరిలో మోడల్స్‌, నటులు సహా కొరియోగ్రాఫ‌ర్లుగా అని సమాచారం. నిందితులను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ పార్టీ నిర్వహించడానికి సహాయపడిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రేవ్‌ పార్టీకి వచ్చిన వాళ్లలో చాలామంది ఖరీదైన కార్లలో ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. 

చదవండి : హీరో కార్తి కోసం ఆ పాత్ర చేయడానికి సిద్ధమైన సిమ్రాన్‌
7 డేస్‌ 6 నైట్స్‌... షూటింగ్‌ మొదలైంది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top