ఎన్టీఆర్‌ బర్త్‌డే, చరణ్‌ స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ | Ram Charan Special Birthday Wishes To Jr NTR With Emotional Post | Sakshi
Sakshi News home page

Jr NTR-Ram Charan: తారక్‌ బర్త్‌డే, హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన చరణ్‌

May 20 2022 1:39 PM | Updated on May 20 2022 1:53 PM

Ram Charan Special Birthday Wishes To Jr NTR With Emotional Post - Sakshi

Ram Charan Special Birthday Wishes To Jr NTR: టాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో వారి బంధం మరింత బలబడింది. మూవీ ప్రమోషన్‌లో వీరిద్దరి బాండింగ్‌ ఎలా ఉందో మనందరం చూశాం. అన్నదమ్ముళ్ల కొట్టుకోవడం, స్నేహితుల్లా కంప్లైంట్‌ చేసుకోవడం, సహానటులుగా ఒకరిపై ఒకరు అభిమానం చూపించుకోవడం చూసి వీరిద్దరి ఫ్యాన్స్‌ తెగ మురిసిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం(మే 20) తారక్‌ బర్త్‌డే సందర్భంగా చరణ్‌ స్పెషల్‌గా బర్త్‌ విషెస్‌ తెలిపాడు.

చదవండి: మలైకాతో పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన అర్జున్‌!

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను హగ్‌ చేసుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ తమ బంధం గురించి నిర్వచించాడు చెర్రి. ‘బ్రదర్‌, కో-స్టార్‌, స్నేహితుడు.. ఏంటో.. నాకు నువ్వు ఎవరనేది చెప్పేందుకు సరైన నిర్వచనం ఇచ్చే పదాలు ఉన్నాయని అనుకోవడం లేదు తారక్‌! కానీ మన మధ్య ఉన్న అనుబంధానికి ఎల్లప్పుడూ నేను గార్డియన్‌గా ఉంటాను. హ్యాపీ బర్త్‌డే’ అంటూ ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చాడు. ఇక చరణ్‌ పోస్ట్‌ చూసి తారక్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. థ్యాంక్యూ చరణ్‌ అన్న.. మీ ఇద్దరి స్నేహం ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: #NTR31: ప్రశాంత్‌ నీల్‌-తారక్‌ మూవీ అప్‌డేట్‌ వచ్చేసింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement