
రామ్‌చరణ్
ఒకవైపు ‘ఆచార్య’, మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. ‘ఆచార్య’ షూటింగ్ త్వరలో పూర్తవుతుంది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా ముగింపు దశకు చేరుకునేసరికి శంకర్ కాంబినేషన్‌లో రామ్‌చరణ్ చేయనున్న సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుందని తెలిసింది. ప్రస్తుతం శంకర్ స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్నారు. జూన్‌లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారట. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా పవర్‌ఫుల్ ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమాను శంకర్ తెరకెక్కించనున్నారని తెలిసింది. ఎమోషనల్ డ్రామా, పవర్‌ఫుల్ సీన్స్, పంచ్ డైలాగ్స్‌తో ఈ ప్యాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. శంకర్ గత చిత్రాలకు సంగీతదర్శకుడిగా చేసిన ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి కూడా స్వరకర్తగా చేయనున్నారని టాక్. ఇది రామ్‌చరణ్‌కి 15వ సినిమా అయితే చిత్రనిర్మాత ‘దిల్’రాజుకి 50వ సినిమా.