
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది మేరీ హస్బెండ్ కీ బీవీ చిత్రంతో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా వస్తోన్న దేదే ప్యార్ దే-2 చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీలో ఆర్ మాధవన్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిట్నెస్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తూ ఉంటోంది. జిమ్లో వర్కవుట్స్ చేస్తూ శ్రమిస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహిస్తూ ఫుల్ గ్లామరస్గా మెయింటెన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన ఫిట్‌నెస్ రొటీన్, వ్యాయామ నియమావళికి సంబంధించిన స్నీక్ పీక్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.

అయితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఈ సందర్భంగా రకుల్ మెడపై ఉన్న ఓ ప్యాచ్ కెమెరాలకు చిక్కింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఇంతకీ అదేంటా అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. చివరికీ ఆ ఈ ప్యాచ్‌ను లైఫ్‌వేవ్ ఎక్స్39 స్టెమ్ సెల్ ప్యాచ్‌గా నెటిజన్స్ గుర్తించారు. ఇది మన శరీరంలోని స్టెమ్ సెల్స్ ఉత్తేజపరిచేందుకు రూపొందించిన వెల్‌నెస్ ప్రొడక్ట్గా తేల్చేశారు. ఈ ప్యాచ్ ఎటువంటి మందులు లేకుండా శక్తిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్ కోసం చాలా మంది సెలబ్రిటీస్ వీటిని వినియోగిచండం ట్రెండ్గా మారింది. వీటి ధర దాదాపు వేల రూపాయల్లోనే ఉండనుంది.