తమిళంలోకి మాస్‌ ఎంట్రీ | RajTarun Mass Entry In Tamil Industry | Sakshi
Sakshi News home page

తమిళంలోకి మాస్‌ ఎంట్రీ

Apr 15 2026 12:04 AM | Updated on Apr 15 2026 12:05 AM

RajTarun Mass Entry In Tamil Industry

లవర్‌ బాయ్‌గా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రాజ్‌ తరుణ్‌  ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్స్‌’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రాజ్‌ తరుణ్, ఆరి అర్జునన్, అమ్ము అభిరామి, కిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రఫ్‌ నోట్‌ ప్రోడక్షన్‌ సంస్థ తమిళ–తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ– ‘‘కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్స్‌’. వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలను మేళవించిన ఈ మూవీ ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది. స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్‌ మా చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించారు’’ అని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement