
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) సడన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే యువతికి ఉంగరం తొడిగాడు. ఈ నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో రాహుల్ జంట డ్యాన్సులు చేస్తూ సంతోషంగా గడిపారు.
ఎంగేజ్‌మెంట్ తర్వాత..
కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ వేదికపై రాహుల్.. కాబోయే భార్యకు కాస్ట్‌లీ హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను హరిణ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే తాజాగా రాహుల్ కన్యాకుమారి వెళ్లాడు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

సింగర్‌గా..
1989 ఆగస్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. చిన్నప్పటినుంచే అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తిని తండ్రి గమనించాడు. గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. ఓపక్క సంగీతం నేర్చుకుంటూ, మరోపక్క తండ్రికి బార్బర్ షాప్‌లో సాయం చేసేవాడు. రానురానూ కోరస్ పాడే అవకాశాలొచ్చాయి. జోష్ మూవీలో కాలేజీ బుల్లోడా పాట పాడే అవకాశం వచ్చింది.
వాస్తు బాగుందే.. (దమ్ము), ఈగ టైటిల్ సాంగ్, సింగరేణుంది (రచ్చ), రంగా రంగా రంగస్థలానా (రంగస్థలం) ఇలా అనేక సాంగ్స్ పాడాడు. యూట్యూబ్‌లో మంగమ్మ, పూర్ బాయ్, గల్లీ కా గణేశ్, దావత్.. ఇలా అనేక ప్రైవేట్ సాంగ్స్‌తో తెగ వైరల్ అయ్యాడు. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో పాడిన నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ రావడంతో బస్తీ కుర్రాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.
చదవండి: కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు