విధిరాత.. రాధేశ్యామ్‌ విషయంలో అదే జరిగింది : పూజా హెగ్డే | Radhe Shyam Heroine Pooja Hegde Says Films Have Their Own Destiny | Sakshi
Sakshi News home page

Pooja Hegde: రాధేశ్యామ్‌ రిజల్ట్‌పై తొలిసారి స్పందించిన పూజా హెగ్డే

Mar 21 2022 10:48 AM | Updated on Mar 21 2022 11:06 AM

Radhe Shyam Heroine Pooja Hegde Says Films Have Their Own Destiny - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం​ రాధేశ్యామ్‌. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అంతగా అందుకోలేకపోయింది. తొలి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత డీలా పడిపోయింది. ఇక బాలీవుడ్‌ అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. పూర్తి ప్రేమకథ చిత్రమైనప్పటికీ ఒక్క యాక్షన్‌ ఎలిమెంట్‌ కూడా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారిపోయింది.

ప్రభాస్‌, పూజా హెగ్డే వంటి స్టార్స్‌ ఉన్నా  అనుకన్న రిజల్ట్‌ మాత్రం​ రాలేదు. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు మనకు యావరేజ్‌ అనిపించినా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతాయి. మరికొన్ని మనకు బాగా నచ్చినా రిజల్ట్‌ అనుకున్నట్లు ఉండకపోవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది. అలాగే జరుగుతుంది. రాధేశ్యామ్‌ విషయంలో కూడా అదే జరిగింది. బాక్సీఫీస్‌ వద్ద సినిమా తలరాత మారిపోతుంది అని బలంగా నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement