రాకా.. బన్ని కెరీర్‌లోనే తొలిసారి! | Raaka Update: Allu Arjun Share Screen With Four Actress | Sakshi
Sakshi News home page

Raaka: రాకా.. ఆ నలుగురితో కేక

Apr 14 2026 2:34 PM | Updated on Apr 14 2026 3:37 PM

Raaka Update: Allu Arjun Share Screen With Four Actress

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు ఆయన‍కు తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారందరిని మెప్పించే కథలపైనే బన్నీ ఫోకస్‌ పెట్టాడు. అందులో ఒకటి రాకా. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న తొలి సినిమా ఇది. రూ. 900 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ రివీల్‌ ఆ అంచనాలను మరింత  పెంచేశాయి. 

ఇందులో  బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన లుక్‌ విలన్‌ది. హీరో పాత్రకు సంబంధించిన లుక్‌ చాలా స్టైలీష్‌గా ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలు మొత్తం నలుగురు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా దీపికా పదుకొణె పేరు బయటకు వచ్చింది. 

మరో ముగ్గురు హీరోయిన్లలో రష్మిక, మృణాల్‌, జాన్నీ కపూర్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో రష్మిక అల్రేడీ బన్నీతో కలిసి పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో నటించింది. మృణాల్‌, జాన్వీలు తొలిసారి బన్నీతో స్క్రీన్‌ చేసుకుంటున్నారు.  ఇలా ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించడం బన్నీ కెరీర్‌లోనే తొలిసారి. కథ డిమాండ్‌ మేరకే నలుగురిని తీసుకున్నారట. అంతేకాదు ఈ నలుగురి పాత్రలు కూడా సినిమాలో కీలకం అట. ఒకవైపు కావాల్సినంత గ్లామర్‌ని చూపిస్తూనే.. మరోవైపు కథలో కీలకంగా వ్యవహరించేలా వీరి పాత్రలను తీర్చిదిద్దినట్లు సమాచారం.  ఈ న‌లుగురూ బ‌న్నీతో ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తే మాత్రం ఫ్యాన్స్‌ పండగ చేసుకోవడం ఖాయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement