ఆ కారణంతో హీరోయిన్‌ని మార్చాం.. బడ్జెట్‌ పెరిగింది: బ్యూటీ నిర్మాత | Producer Vijaypal Reddy Adidhala Talk About Beauty Movie | Sakshi
Sakshi News home page

వారం రోజులు షూట్‌ చేసిన తర్వాత హీరోయిన్‌ని మార్చాం..కారణం ఇదే: బ్యూటీ నిర్మాత

Sep 17 2025 5:45 PM | Updated on Sep 17 2025 6:20 PM

Producer Vijaypal Reddy Adidhala Talk About Beauty Movie

సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశం, లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు, అన్ని రకాల జానర్లలో డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను.అందుకే ‘బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలను నిర్మించాను’ అన్నారు నిర్మాత విజయ్‌ పాల్‌ రెరడ్డి అడిదల.ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై ఆయన నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా..  జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత విజయ్‌ పాల్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘బ్యూటీ’ కథలో అందమైన ప్రేమ కథతో పాటుగా మనసుని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రంగా మా ‘బ్యూటీ’ నిలుస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడదగ్గ చిత్రం. నాకు పర్సనల్‌గా ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్ నచ్చే నిర్మించేందుకు ముందుకు వచ్చాను.

ఈ కథను విన్న వెంటనే ఈ మూవీని చేద్దామని మారుతికి చెప్పాను. జీ స్టూడియో సహకారం వల్లే మా సినిమాను ప్రతీ ఒక్కరికీ రీచ్ చేయగలిగాం. రిలీజ్ విషయంలో వారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా మూవీని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్‌తో తరువాత మళ్లీ థియేటర్లను పెంచుతాం.

‘బ్యూటీ’ని ప్రారంభంలో వేరే హీరోయిన్‌తో షూటింగ్ చేశాం. ఓ వారం రోజులు అలా షూటింగ్ చేశాం. ముందుగా రైటర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. హీరోయిన్‌ పక్కింటి అమ్మాయిలా ఉండాలి అనుకున్నాం. ఆ హిరోయిన్ పాత్రకు అంతగా సెట్ అవ్వడం లేదు అని అంతా అనుకున్నాం. ఆ తరువాత నీలఖి ఈ సినిమాలోకి వచ్చారు. అలా సినిమా ఆరంభంలో చేసిన షూటింగ్ అంతా వృథా అయింది. దాని వల్ల బడ్జెట్ కాస్త పెరిగింది.

ఇప్పటి వరకు ‘బ్యూటీ’ జర్నీ ఎంతో బాగా సాగింది. టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో.. జనాల్లోకి ఎక్కువగా వెళ్లింది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు చూసిన వారంతా కూడా మూవీని మెచ్చుకున్నారు. రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement