Dil Raju : షూటింగ్స్‌ బంద్‌పై సుమన్‌ కామెంట్స్‌.. దిల్‌రాజు ఏమన్నారంటే..

Producer Dil Raju Visits Tirumala With His Wife And Son Pics Goes Viral - Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొడుకు పుట్టాక ఆయన భార్య తేజస్వినితో కలిసి తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబ‌ర్ 10, 2020న అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దిల్‌రాజు, తేజస్వినిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

రీసెంట్‌గానే దిల్‌రాజు మరోసారి తండ్రి అయ్యారు. దీంతో కొడుకుతో సహా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.కాగా ఈ సందర్భంగా సినిమా షూటింగ్స్‌ నిలిపివేయడంపై సుమన్‌ మాట్లాడిన తీరుపై రిపోర్టర్స్‌ స్పందించగా సినిమాకు సంబంధించిన విషయాలు అక్కడ ప్రస్తావించనన్నారు.

దేవుడి సన్నిధిలో వాటి గురించి చర్చించనంటూ పేర్కొన్నారు. కాగా ఆగస్ట్‌ 1 నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌ నిలిపివేయాలని ప్రొడ్యుసర్స్‌ గిల్డ్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top