అప్పట్లో షారుక్‌ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి

Priyamani Reveals Shahrukh Khan Gave Her 300 Rs Chennai Express Set Wallet - Sakshi

‘చెన్నైఎక్స్‌ప్రెస్‌’లో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ప్రియమణితో చిందేసిన ఐటమ్‌సాంగ్‌ గుర్తుందా. అదేనండి అప్పట్లో వన్‌ టూ త్రీ ఫోర్‌.. గెట్‌ ఆన్‌ ది డ్యాన్స్‌ ఫ్లోర్‌..అంటూ స్టెప్పులేసిన ఈ పాట సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా?  ఇటీవల విడుదలై విశేష ప్రజాదరణ పొందుతున్న ఫ్యామిలీ మ్యాన్‌-2తో ఆకట్టుకున్న నటి ప్రియమణి ఓ ఇంటర్య్వూలో ఈ ఐటెం సాంగ్‌ చిత్రీకరణ షూటింగ్‌ సమయంలోని కబుర్లను గుర్తుచేసుకుంది.

అది నా పర్సులో భద్రంగా దాచుకున్నా
ఈ సందర్భంగా ఆమె.. ‘‘నాకు అది మరచిపోలేని అనుభవం. షూటింగ్‌ సమయంలో షారుఖ్‌ ఐప్యాడ్‌లో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఆడుతుంటే రూ.300 ఇచ్చారు. అవి ఇప్పటికీ నా పర్సులో భద్రంగా దాచుకున్నా. షారుఖ్‌ని బాలీవుడ్‌ బాద్‌షా అని అనడానికి ప్రత్యేకించి ఒక్క కారణమంటూ లేదు. మనదేశంలో ఉన్న గొప్పనటుల్లో ఆయన ఒకరు. సక్సెస్‌ని ఎప్పుడూ తలకెక్కించుకోరు. షూటింగ్‌లోనూ చాలా సింపుల్‌గా ఉంటారు. షారుక్‌ వ్యక్తిత్వమే మనల్ని మరింతగా ఆయన్ని ఇష్టపడేలా చేస్తుంది. ఎప్పుడు మరుసటి రోజు సమయం వృథా కాకుండా జాగ్రత్త పడేవారు. అలా షూటింగ్‌ సమయాన్ని చక్కగా ప్లాన్‌ చేసుకునే వారు’’ అంటూ షారుఖ్‌తో తన అనుబంధాన్ని ఈ రకంగా చెప్పుకొచ్చింది.

చదవండి: ఆ కామెంట్స్‌ చూసి తట్టుకోలేకపోయా: జరీన్‌ ఖాన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top